
కొత్త గెలిచిన ఎంపీ.. సినీ నటి కంగనా రనౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. చండీఘర్ ఎయిర్ పోర్టులో చెకింగ్ దగ్గర సీఐఎస్ఎఫ్ మహిళా సిబ్బంది.. నన్ను చెంప దెబ్బ కొట్టారంటూ ఆరోపించారు. చండీఘర్ నుంచి ఢిల్లీ రావటానికి ఎయిర్ పోర్టుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని వివరించారు కంగనా రనౌత్.
ఢిల్లీ చేరుకున్న తర్వాత సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నీనా సింగ్ కు ఈ ఘటనపై కంప్లయింట్ చేసినట్లు వెల్లడించారామె. చండీఘర్ ఎయిర్ పోర్ట్ లోని నిషేధిత ప్రాంతంలో తాను ఉండగా.. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ తో వాగ్వాదం జరిగిందన్నారు. ఈ తర్వాత ఆమె నన్ను చెప్పుతో కొట్టారని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆరోపించారు.
ఈ ఘటన తర్వాత అక్కడే ఉన్న కమాండింగ్ ఆఫీసర్.. మహిళా కానిస్టేబుల్ ను తన గదిలో నిర్బంధించారని.. ఆమెను విచారించినట్లు స్పష్టం చేస్తున్నారామె. దీనిపై స్పందించిన డైరెక్టర్ జనరల్.. చండీఘర్ ఎయిర్ పోర్ట్ నుంచి సీసీ కెమెరా విజువల్స్ తెప్పించి.. విచారణ చేసి.. తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసినట్లు వివరించారు కంగనా రనౌత్