జనగామ జిల్లాలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

జనగామ జిల్లాలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

జనగామ జిల్లాలో  తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వ్యక్తిగత కారణాలతో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.  కొడకండ్ల మండలం నీలిబండ తండాకు చెందిన మహిళా కానిస్టేబుల్ నీలిమ ఆత్మహత్య చేసుకుంది. దీంతో కొడకండ్ల గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

నీలిమ వరంగల్ కమీషనరేట్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. క్రమం తప్పకుండా విధులకు హాజరవుతూ అందరితో కలివిడిగా ఉండే నీలిమ సూసైడ్ చేసుకోవడంపై ఇతర ఉద్యోగులు ఆశ్చర్యానికి గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.  అయితే ఈ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Also Read : జాతకం బాలేదు.. శాంతి పూజలు చేయాలని