- మహిళా కానిస్టేబుల్,ఎస్ఐ మిస్సింగ్
- వారితోపాటు మరో వ్యక్తి గల్లంతు
- అడ్లూరి ఎల్లారెడ్డి చెరువు వద్ద ఎస్ఐ కారు, చెప్పులు, సెల్ఫోన్లు
- సూసైడ్ చేసుకున్నట్టు అనుమానాలు
- గజ ఈతగాళ్లతో గాలింపు..కామారెడ్డి జిల్లాలో కలకలం
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో ఎస్ఐతో సహా ముగ్గురు గల్లంతు కావడం కలకలం రేపింది. భిక్కనూర్ఎస్ఐ సాయికుమార్, మహిళా కానిస్టేబుల్శృతి, మరో వ్యక్తి నిఖిల్బుధవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారు. ఎస్సై మిస్సింగ్‌పై ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో సెల్ ఫోన్ సిగ్నల్స్‌ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టారు. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు సమీపంలో టవర్ లొకేషన్ ఆగిపోయినట్టు గుర్తించారు. చెరువు కట్ట సమీపంలో ఎస్సై సొంత కారును గుర్తించారు. చెరువుగట్టున ఇద్దరు పురుషుల చెప్పులు ఉన్నట్టు కనుగొన్నారు. వీరి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఫైర్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకొని, గజ ఈతగాళ్లతో చెరువులో అర్ధరాత్రి వరకు గాలించారు. మహిళా కానిస్టేబుల్‌తోపాటు నిఖిల్ డెడ్ బాడీలు లభ్యమయ్యాయి. ఎస్ఐ ఆచూకీ లభించలేదు. వీరందరూ సూసైడ్ చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు.