వన్డే ప్రపంచకప్ 2023 ప్రారంభమై దాదాపు రెండు వారాలు పూర్తి కావస్తోంది. ఈ పక్షం రోజుల్లో మూడు నాలుగు మ్యాచ్‌లు మినహా అన్నీ ఏకపక్షంగా సాగిపోయాయి. టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మూడింట రెండింటిలో ఓడగా.. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా వంటి అగ్రశ్రేణి జట్లు.. పసికూన ఆఫ్గనిస్తాన్, నెదర్లాండ్స్ వంటి జట్ల చేతిలో ఓడాయి.
ఇక స్వదేశంలో వన్డే ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న భారత జట్టు.. వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆసీస్ మినహా అఫ్గాన్, పాక్‌లపై భారత్ సునాయాస విజయాలు అందుకుంది. ఈ క్రమంలో భారత్‌ను ఓడించడమంటే ఇతర జట్లకు సవాల్‌తో కూడుకున్నదే. అందునా ఈ మెగా టోర్నీ స్వదేశంలో జరుగుతుండటం భారత్‌కు మరింత కలిసొస్తోంది. అయినప్పటికీ,, భారత్‌కు విశ్వవిజేతగా నిలిచే అవకాశాలు లేవట. 2023 ప్రపంచ కప్ చేజిక్కించుకునే జట్టు ఏదన్న దానిపై ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్, అందగత్తె ఎల్లిస్ పెర్రీ జోస్యం చెప్పింది.
అక్టోబర్ 20న బెంగళూరు వేదికగా పాకిస్తాన్ మ్యాచ్‌లో విజయం సాధించే జట్టు, వరల్డ్ కప్ గెలిచే జట్టు తమ దేశమే అని పెర్రీ తెలిపింది. అంటే తన అభిప్రాయం ప్రకారం.. ఆస్ట్రేలియా టైటిల్ విజేతగా నిలవనుందన్నమాట. కానీ, ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా ప్రదర్శన అంతంత మాత్రమే. మూడింట రెండింటిలో ఓడిన ఆస్ట్రేలియా సెమీస్ చేరితే చాలనుకుంటోంది. చూడాలి మరి ఈ అందాల భామ చెప్పిన మాటలు ఎంతవరకు నిజమవుతాయో.
ALSO READ : Cricket World Cup 2023: గంటకు 200 కిమీ వేగంతో డ్రైవింగ్.. రోహిత్‌కు షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు
అగ్రస్థానంలో న్యూజిలాండ్
ఇప్పటివరకూ ఒక్కసారి వరల్డ్ కప్ టైటిల్ అందుకోని న్యూజిలాండ్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆడిన 4 మ్యాచ్ ల్లో అన్నింటా విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఇక భారత జట్టు మూడు విజయాలతో(3 మ్యాచ్ ల్లో) రెండవ స్థానంలో ఉండగా.. మూడింట రెండు విజయాలతో దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.