
హైదరాబాద్ లో ఇన్ కమ్ ట్యాక్స్ మహిళా ఆఫీసర్ ఆత్మహత్య చేసుకుంది. ఏమైందో ఏమో కారణాలేంటో తెలియవు కానీ బిల్డింగ్ పై నుంచి దూకి ఐటీ ఆఫీసర్ జయలక్ష్మీ చనిపోవడం కలకలం రేపుతోంది.
హైదరాబాద్ కవాడీగూడలో ఏప్రిల్ 5న గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీజీవో టవర్స్ పై నుంచి దూకి ఇన్ కమ్ ట్యాక్స్ మహిళా ఆఫీసర్ జయలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
సీజీవో టవర్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే గాంధీనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనారోగ్య కారణాలతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు గాంధీనగర్ పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.