
ఆర్టీసీ సిబ్బందిపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎక్కడో చోట ప్రయాణికులు కండక్టర్లపై చేయి చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఆర్టీసీ మహిళా కండక్టర్ పై ఓ మహిళా ప్రయాణికురాలు దాడి చేసింది. బస్సులో వందమందికి పైగా ప్రయాణికులు ఉండడంతో కొంచెం ఆగండి అని అన్నందుకు మహిళ చేయి చేసుకుందని ఆ కండక్టర్ ఆరోపిస్తున్నారు.
విధుల్లో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేయడం క్షమించరాని నేరమని, ఏ మాత్రం సహించబోమని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రెండు రోజుల క్రితమే హెచ్చరించారు. పోలీస్‌శాఖ సహకారంతో హిస్టరీ షీట్స్తెరుస్తామని చెప్పారు. బస్సు డ్యామేజీ ఖర్చులను నిందితుల నుంచే వసూలు చేస్తామన్నారు. దాడిచేసిన వారికి ఐపీసీ 353 సెక్షన్‌ప్రకారం రెండు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్) వేదికగా హెచ్చరించారు.