
రోజు రోజుకు ప్యాషన్ కల్చర్ ముదిరిపోతుంది. జనాలు ఏం ఆలోచిస్తున్నారో తెలియడం లేదు కాని.. ప్యాషన్ డ్రస్ లంటూ మహిళా యూత్ హల్చల్ చేస్తుంది. రాను రాను అది మితిమీరుతుంది. తాజాగా ఓ మహిళ సిగరెట్లతో శరీరాన్ని కప్పుకుంది. అంతటితో ఊరుకుందా అంటే ఊరుకోలేదు.. సిగరెట్లతో తయారు చేసిన డ్రస్‌ను వేసుకొని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు స్పందించారు.
ఉర్ఫీ జావెద్ అనే మహిళ సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్టివ్ అయింది. గుడియా అనే మహిళ తన ఇన్‌స్ట్రాగ్రామ్ లో సిగరెట్ లతో తయారు చేసిన డ్రస్ ను వేసుకొని పోస్ట్ చేసింది. గడియా అనే ఇన్స్ట్రాగ్రామర్ గౌను ను తయారు చేసేందుకు సిగరెట్లను ఉపయోగించింది. సిగరెట్లను రివర్స్ లో అతికించి సింగిల్ స్ట్రాప్ టూ-పీస్ డ్రెస్ ను తయారు చేసింది.
దీనిని తానే తయారు చేశానని.. ఎలాంటి మెషిన్ ఉపయోగించలేదని...చేతులతో తయారు చేసినట్లు తెలిపింది. దాదాపు 100 కు పైగా సిగరెట్లను ఉపయోగించి గౌను తయారు చేసినట్లు తెలిపింది. సిగరెట్ ఒకవైపున రౌండ్ గా ఉండే కలర్ డిజైన్‌కు మరింత అందాన్ని ఇచ్చింది,
టాప్.. స్కర్ట్ పొడవుకు తగినవిధంగా సిగరెట్లను రివర్స్‌లో అమర్చించి. ఇంకా చెవి కమ్మలు.. గాజులు.. లాంటివి కూడా మ్యాచింగ్ వేసుకుంది. ఈ డ్రస్ తయారు చేసేందుకు చాలా ఖర్చయిందని.. చాలా కష్టపడ్డామని .. లైక్ చేయాలని కోరింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయబడిన ఈ క్లిప్ వైరల్‌గా మారింది. ఇప్పటికి ఆరు లక్షలకు పైగా లైక్‌లను పొందింది. ఆమె దుస్తులను చూసిన జనాలు ఆశ్చర్యపోయారు. దీనిపై స్పందించి నెటిజన్లు పాన్ షాపులో సిగరెట్ల కొరత ఎందుకొచ్చిందా అని ఆలోచిస్తున్నానని ఒకరు ఫన్నీగా స్పందించారు.. ఇంకొకరు సిస్టర్.. నాకు ఒక సిగరెట్ ఇవ్వరా.. తాగాలని అనిస్తుందని మరొకరు వ్యాఖ్యానించారు. మరికొందరు దీనిని అటెన్షన్ సీకింగ్ స్టంట్ అనగా.. ఇంకొందరు యువతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏది ఏమైనా.. ఈ ప్యాషన్ కల్చర్ ఎటు దారితీస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. సోషల్ మీడియా ప్రపంచంలో అందరూ హైలట్ అవ్వానుకుంటున్నారు. అది ఎంతవరకు సమంజసమో ఆలోచించడం లేదు. పోస్ట్ లైక్.. షేర్ లు వచ్చాయా.. లేదా అనేది మాత్రమే లెక్కలేసుకుంటున్నారు. మరి ఈ పోకడ దేనికి దారితీస్తోంది చూడాలి...!