పెద్దమ్మతల్లి గుడిలో.. దైవ దర్శనానికి వచ్చి సెల్ఫోన్లు చోరీ

పెద్దమ్మతల్లి గుడిలో.. దైవ దర్శనానికి వచ్చి సెల్ఫోన్లు చోరీ
  • నలుగురు అరెస్ట్

పంజాగుట్ట, వెలుగు: దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మతల్లిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల ఫోన్లను నలుగురు దొంగల ముఠా కొట్టేసింది. బాధితుల ఫిర్యాదుతో కేసులు నమోదు చేసిన జూబ్లీహిల్స్​పోలీసులు బుధవారం నలుగురిని అరెస్ట్​చేశారు. 7 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. 

ఫతేనగర్​వడ్డెర బస్తీకి చెందిన మార్​లీన్​అలియాస్​మేరీ(19), శాంతి నగర్​కు చెందిన యుగంధర్, బాలానగర్​సాయినగర్​ కు చెందిన రాయలపురం వెంకటేశ్(30), రాజు కాలనీకి చెందిన రేణుక ముఠాగా ఏర్పడ్డారు. 

మేరీ ఆలయంలో భక్తుల నుంచి ఫోన్లు కొట్టేసి ఇస్తే మిగిలిన ముగ్గురు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల నవరాత్రుల సందర్భంగా భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తుల సెలఫోన్లు కొట్టేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు మేరీ, మిగిలిన ముగ్గురిని గుర్తించారు. 7 ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఇన్​స్పెక్టర్​ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.