- ఆసియా ఫెన్సింగ్‌లో పతకం నెగ్గిన ఇండియన్‌గా రికార్డు
న్యూఢిల్లీ: ఇండియా స్టార్ ఫెన్సర్ భవానీ దేవి కొత్త చరిత్ర సృష్టించింది. ఆసియా ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో బ్రాంజ్ గెలిచింది. దాంతో, ఈ టోర్నీలో పతకం సాధించిన తొలి ఇండియన్ గా రికార్డుకెక్కింది. చైనాలోని వుజిలో సోమవారం జరిగిన విమెన్స్ సాబ్రెలో సెమీఫైనల్ చేరుకోవడం ద్వారా ఈ ఘతన సాధించింది. 29 ఏండ్ల భవానీ క్వార్టర్ ఫైనల్లో 15–-10తో వరల్డ్ చాంపియన్ మిసాకి ఎమురా (జపాన్)ను ఓడించి ఆశ్చర్యపరిచింది. అయితే, హోరాహోరీగా సాగిన సెమీస్‌లో 14–15తో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన జైనబ్ చేతిలో ఓడిపోయింది. దాంతో, కాంస్యంతో తిరిగొచ్చినా కొత్త చరిత్రను లిఖించింది.