ఫార్ములా ఈ కార్ రేసు కేసులో లండన్ కంపెనీ FEO కు నోటీసులు: నాలుగు వారాల తర్వాత వస్తానన్న సీఈఓ.

ఫార్ములా ఈ కార్ రేసు కేసులో లండన్ కంపెనీ FEO కు నోటీసులు: నాలుగు వారాల తర్వాత వస్తానన్న సీఈఓ.

ఫార్ములా ఈ కార్ రేసులో విచారణ వేగవంతం చేసింది ఏసీబీ.. ఈ క్రమంలో విచారణకు హాజరవ్వాలని ఏసీబీ ఇచ్చిన నోటీసులపై స్పందించింది లండన్ కంపెనీ FEO. విచారణకు హాజరయ్యేందుకు నాలుగు వారాల గడువు కావాలని ఏసీబీని కోరారు FEO సీఈఓ. ఈ మేరకు సానుకూలంగా స్పందించింది ఏసీబీ. నాలుగు వారాల గడువుకు అనుమతిచ్చారు ఏసీబీ అధికారులు.విచారణలో భాగంగా హెచ్ఎండీఏ నుంచి FEO కంపెనీకి రూ.50 కోట్లకు పైగా నిధులు బదిలీ అయినట్లు తేల్చింది ఏసీబీ. 

ఈ కేసులో విచారణ తర్వాత FEO కంపెనీ సీఈవో ఇచ్చే స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేయన్నారు ఏసీబీ అధికారులు.ఇదిలా ఉండగా ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏ1 గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్‌ స్టేట్‌మెంట్‌ ఇప్పటికే రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏ2గా ఉన్న అప్పటి మునిసిపల్, పట్టణాభివృద్ధి స్పెషల్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఏ3గా ఉన్న హెచ్ఎండీ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి వాంగ్మూలాన్ని ఏసీబీ రికార్డ్ చేసింది ఏసీబీ.

అంతే కాకుండా జనవరి 18న గ్రీన్ కో, ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీ ప్రతినిధుల స్టేట్‌మెంట్లను సైతం రికార్డ్ చేసింది ఏసీబీ. మరి FEO కంపెనీ విచారణ తర్వాత ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.