జనాభా తగ్గుతోంది.. కనీసం ముగ్గురు పిల్లల్ని కనండి: మోహన్ భగవత్

జనాభా తగ్గుతోంది.. కనీసం ముగ్గురు పిల్లల్ని కనండి: మోహన్ భగవత్

నాగ్​పూర్: ప్రతీ కుటుంబమూ సమాజంలో భాగమేనని, సమాజంలో ప్రతీ కుటుంబమూ కీలకమేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్​(ఆర్ఎస్ఎస్) చీఫ్​ మోహన్ భగవత్​అన్నారు. జనాభా పెరుగుదల క్రమంగా క్షీణించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు ఆదివారం నాగ్​పూర్‎లో జరిగిన ఓ కార్యక్రమంలో భగవత్ మాట్లాడారు. దేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు (టీఎఫ్ఆర్) కనీసం 3 శాతం ఉండాలని, అప్పుడే ఏ సమాజమైనా నిశ్చింతగా మనుగడ కొనసాగిస్తుందని చెప్పారు. ఫెర్టిలిటీ రేట్ 2.1 గా ఉంటే దానిని పాపులేషన్ రిప్లేస్ మెంట్ రేట్ అంటారని చెప్పారు.

 అంటే నిర్ణీత కాలంలో దేశవ్యాప్తంగా జననమరణాలు సమానంగా ఉండడమని వివరించారు. దీనికంటే టీఎఫ్ఆర్​ఎక్కువగా ఉంటే జనాభా పెరుగుతూ ఉంటుందని తెలిపారు. ఒకవేళ ఈ రిప్లేస్ మెంట్ రేట్ కన్నా టీఎఫ్ఆర్ తగ్గితే మాత్రం ఆ సమాజం నెమ్మదిగా అంతరించి పోతుందని భగవత్ వివరించారు. ఏ సమాజమైనా సరే అంతరించడానికి ప్రతిసారీ బయటి శక్తుల ప్రభావమే అక్కర్లేదని, టీఎఫ్ఆర్ తగ్గితే దానికదే చరిత్రలో కలిసిపోతుందని పేర్కొన్నారు.