రైతన్నల కష్టాలకు చెక్​ : 11.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రవాణా

రైతన్నల కష్టాలకు చెక్​ :  11.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రవాణా

 

  • ఆర్ఎఫ్​సీఎల్​ చీఫ్ జనరల్​ మేనేజర్​ఉదయ్​ రాజహంస వెల్లడి

గోదావరిఖని, వెలుగు: రామగుండం ఫెర్టిలైజర్స్​అండ్​ కెమికల్స్​ లిమిటెడ్(ఆర్ఎఫ్​సీఎల్) ప్లాంట్​నుంచి 2024 –-25 ఆర్థిక సంవత్సరంలో 11.70 లక్షల మెట్రిక్​టన్నుల యూరియా రవాణా చేసినట్టు ఆర్ఎఫ్​సీఎల్​ చీఫ్  జనరల్​ మేనేజర్ ​ఉదయ్​ రాజహంస తెలిపారు. 400వ రేక్​ద్వారా యూరియాను సప్లై చేస్తున్న రైలును గురువారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీజీఎం మాట్లాడుతూ దేశంలో వ్యవసాయోత్పత్తిని పెంచడం కోసం రైతులకు అందుబాటు ధరలకు సకాలంలో యూరియాను అందించడానికి ఆర్ఎఫ్​సీఎల్​కృషి చేస్తుందన్నారు. 

‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యంతో కేంద్రం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ద్వారా యూరియాను రాష్ట్రంతో పాటు ఏపీ, చత్తీస్​గడ్​, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవాలకు సప్లై చేస్తున్నట్టు చెప్పారు. ఇందుకు సహకరిస్తున్న రాష్ట్ర పరిపాలన శాఖ, కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ, కేంద్ర రైల్వే శాఖకు, వాటాదారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.