నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ ఫెస్టివల్ సీజన్ లో ఉద్యోగాల జాతర కొనసాగనుంది. ముఖ్యంగా ఈ కామర్స్ రంగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సుమారు 12.5లక్షల ఉద్యోగులను రిక్రూట్ చేసుకునేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. రిక్రూట్ మెంట్ కు సంబంధించిన ప్రముఖ స్టాఫ్ మేనేజ్ మెంట్ ఫ్లాట్ ఫాం..టీంలీజ్ సర్వీసెస్ గిగా వర్కర్స్, కాంట్రాక్టు సిబ్బందిని నియమించేందుకు రెడీ అవుతోంది.. ఈ కామర్స్ రంగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.. జాబ్ హియరింగ్ పై మరింత సమాచారం తెలుసుకుందాం..
రాబోయే పండగ సీజన్ లో దాదాపు 35 శాతం అమ్మకాలు పెరగనున్నాయి.. గత సంవత్సరంతో పోలిస్తే ఈ గణనీయమైన పెరుగుదల ఉండే అవకాశం ఉంది. ఈ మార్పుతో ఈ కామర్స్ రంగంలో ఆన్ లైన్ లో ఎక్కువగా అమ్మకాలు జరిగుతాయని టీం లీజ్ సర్వీసెస్ అంచనా వేస్తుంది.
ఈ కామర్స్ లో 12.5లక్షల ఉద్యోగాలు
పండగ రద్దీలో పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా సర్వ్ చేసేందుకు ఈ కామర్స్ కంపెనీలు అదనంగా సిబ్బందిని తీసుకునే ప్రక్రియను వేగవంతం చేశాయి. ఆన్ లైన్ మరింత విస్తరించేందుకు, ఆన్ బోర్డు చేయడం, ఎటువంటి ఆటంకంలేని సర్వీస్ ను అందించేందుకు, సకాలంలో డెలివరీలను అందించేందుకు ఈ కామ ర్స్ సంస్థలు.. 10 లక్షల మంది గిగ్ వర్కర్లు, 2.5 లక్షల మంది కాంట్రాక్టు సిబ్బందిని నియమించుకుంటున్నాయి.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థలన్నీ ఇప్పుడు నగరాల్లోనే కాకుండా కొత్త నగరాలకు కూడా వారి సేవలను విస్తరిస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్, హోమ్ డెకర్, బ్యూటీ, వెల్ నెస్, కిరాణా సామాగ్రిని వంటి వాటిపై మంచి ఆఫర్లను అందిస్తున్నాయి. సిబ్బంది రిక్రూట్ మెంట్ తో కస్టమర్ల అవసరాలను తీర్చే ప్రయత్నంలో ఈ కామర్స్ సంస్థలు పనిచేస్తున్నాయి.
గతేడాది మార్చిలో రోజుకు 20 లక్షల ఆర్డర్ల మైలు రాయిని తాకియా ఈ కామర్స్ సంస్థలు. రాబోయే పండుగ సీజన్ లో ఈ రికార్డును అధిగమించేందుకు కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
కేవలం ఉద్యోగాలను సృష్టించడమేకాదు..2025 నాటికి 5 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే భారత దేశ లక్ష్యానికి అనుగుణంగా ఈ నియామకాలు జరుగుతు న్నాయని టీమ్ లీజ్ సర్వీసెస్ బిజినెస్ హెడ్ బాలసుబ్రమణియన్ చెప్పారు.