భద్రకాళీ ఆలయంలో ఉత్సవాలు ప్రారంభం

గ్రేటర్ వరంగల్, వెలుగు: వరంగల్​భద్రకాళి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యారు.  ఉగాదిని పురస్కరించుకుని అమ్మవారికి లక్ష పుష్పార్చనతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శేషు భారతి, ప్రధాన అర్చకుడు మాట్లాడుతూ దాతల సహకారంతో నవరాత్రుల్లో నిత్యం లక్ష పుష్పార్చన చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రామ్మూర్తి, కుమారస్వామి, నాగరాజు, శ్రీకాంత్, భక్తులు తదితరులున్నారు.