
- శనివారం టెన్త్ స్టూడెంట్ మృతి
- కొద్దిగంటల్లోనే మరో వ్యక్తి కన్నుమూత
కాగజ్‌నగర్, వెలుగు: కుమ్రంభీం జిల్లా కౌటాల మండలం గుండాయిపేట్ విషజ్వరాలు ప్రబలడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే గ్రామానికి చెందిన టెన్త్ స్టూడెంట్ పూజ జ్వరంతో శనివారం చనిపోగా, ఆమె దహన సంస్కారాలు కాకముందే అదే గ్రామానికి చెందిన బోయర్ కాళిదాస్ (32) జ్వరంతో చనిపోయాడు. కాళిదాస్‌కు వారం కింద జ్వరం వచ్చింది. ఆయనను స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ దగ్గరకు తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో మంచిర్యాలలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా ట్రీట్‌మెంట్ తీసుకుంటూ శనివారం అర్ధరాత్రి చనిపోయాడు. కాగా డీఎంహెచ్‌వో గ్రామాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. గంటల వ్యవధిలోనే జ్వరాలతో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.