
పిల్లల్లో తరుచుగా మనం జలుబు, జ్వరం, కడుపునొప్పి వంటి సమస్యలు చూస్తుంటాం.. ఇలాంటి సమయంలో బిడ్డ చాలా ఇబ్బంది పడుతుంది. వారిని చూసుకోవడం పేరెంట్స్ కు చాలా కష్టంగా ఉంటుంది. తేలికపాటి అసౌకర్యం నుంచి చికిత్స చేయించాల్సిన స్టేజ్ వరకు ఈ లక్షణాలుంటాయి. ఇవి కాలానుగుణంగా పెరుగుతున్నాయి.పిల్లల్లో ఇలాంటి సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. పిల్లల్లో తరుచుగా జ్వరం, దగ్గు, వాంతులు వస్తే ఏం చేయాలి.. ఎప్పుడు డాక్టర్లను సంప్రదించాలి వంటి అంశాలను తెలుసుకుందాం.
సాధారణంగా 5నుంచి 12 ఏళ్ల వయసు గల స్కూల్ కు వెళ్లే పిల్లల్లో ప్రతి పదిమందిలో ఏడుగురు జ్వరం, జలుబు, గురక, దగ్గు, ముక్కు కారటం, గొంతునొప్పి, వికారం, వాంతులు, కడుపునొప్పి, ఉబ్బరం, తిమ్మిరి, డీహైడ్రేషన్ సమస్య, బాడీ పెయిన్స్, కీళ్ల నొప్పి, మలబద్దకం, విరేచనాలు వంటి సమస్యలు కనిపిస్తుంటాయి.
వాతావరణంలో ఆకస్మిక మార్పులు, బయటి ఆహారం తినడం, పరిశుభ్రత పాటించకపోవడం వంటి కారణాలతో పిల్లలు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారు. పిల్లల్లో రోగనిరోధక శక్తి ఇంకా అభివృద్ది దశలో ఉంటుంది కాబట్టి వారు ఎక్కువగా ఇన్ఫెక్షన్లకు గురవుతుంటారు.
Also Read :- రాత్రి భోజనం తర్వాత ఎందుకు నడవాలి..
పిల్లల్లో జలుబు, జ్వరం, కడుపునొప్పి వంటి సమస్యలు పెరుగుతున్నప్పుడు అనారోగ్యంతో ఉన్న బిడ్డను చూసుకోవడం పెరేంట్స్ కు చాలా కష్టంగా ఉంటుంది. కాలానుగుణ వ్యాధులు పెరుగుతున్నందున పిల్లలను హైడ్రేటెడ్ గా ఉంచటం, ఇంటి ఆహారం ఇవ్వడం, టీకాలు వేయించడం,ఎప్పుడు శుభ్రంగా ఉండటంచాలా అవసరం అంటున్నారు డాక్టర్లు.
పిల్లల్లో ఇలాంటి సీజనల్ వ్యాధులు ప్రబలినప్పుడు పేరెంట్స్ నిశితంగా పరిశీలించాలి. ఇంటి పరిసరాలు శుభ్రత, అనారోగ్యంతో ఉన్నవారికి పిల్లలను దూరం ఉంచడం, మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటివి పిల్లల్లో తరచుగా వచ్చే అనారోగ్య సమస్యలనుంచి రక్షించేందుకు అదనపు మార్గాలని చెబుతున్నారు డాక్టర్లు. శ్వాస తీసుకోవడం ఇబ్బంది, నిరంతరం వాంతులు, మందులతో మెరుగుపడని అధిక జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలంటున్నారు.
ఇంకా పిల్లలు అనారోగ్యంతో ఉన్నపుడు స్కూల్ కి పంపకూడదు, ఇంట్లో వండిన ఆహారం మాత్రమే ఇవ్వాలి.. జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉంచాలి. ముఖ్యంగా చక్కెర ఉన్న ఆహార పదార్థాలను తినకుండా చూడాలి, మరిగించి చల్లార్చిన నీటిని తాగించాలని సూచిస్తున్నారు.