హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించారు. శుక్రవారం నుంచి హెల్త్ వర్కర్లు ఇంటింటికీ తిరిగి లక్షణాలు ఉన్నవారికి హోం ఐసోలేషన్ కిట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కరోనా పరిస్థితులపై హరీష్ రావు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వే, హోం ఐసోలేషన్ కిట్లను నీతి ఆయోగ్ మెచ్చుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెండు కోట్ల టెస్టింగ్ కిట్స్ తో పాటు కోటి హోం ఐసోలేషన్ కిట్ అందుబాటులో ఉన్నట్లు హరీష్ ప్రకటించారు. అన్ని పీహెచ్సీలు, బస్తీదవాఖానాల్లో వాటిని అందుబాటులో పెట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికి 77శాతం సెకండ్ డోస్ పూర్తైందని అన్నారు.
మరిన్ని వార్తల కోసం..