సికింద్రాబాద్, వెలుగు: పుణె డివిజన్ దౌండ్మన్మాడ్ సెక్షన్ లోని రాహురి -పదగావ్ స్టేషన్ల మధ్య ట్రాక్ లైన్ డబ్లింగ్పనుల కారణంగా పలు రైళ్లను ఈనెల 21, 22 తేదీల్లో దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. నిజామాబాద్– పుణె, నాందేడ్– పుణె, నిజామాబాద్– పుణె ఎక్స్ప్రెస్ రైళ్లు పర్బణి, పార్లీ, లాతూర్, కుర్దువాడి, దౌండ్స్టేషన్ల మీదుగా నడుస్తాయని వెల్లడించారు. దౌండ్–- నిజామాబాద్, పుణె–- నాందేడ్, యశ్వంత్పూర్– -అహ్మదాబాద్ రైళ్లను దౌండ్, కుర్దువాడి, లాతూర్, పార్లీ, పర్బణి స్టేషన్ల మీదుగా నడుపుతామని రైల్వే అధికారులు వివరించారు.
అలాగే నిజాముద్దీన్ -ఎస్ఎస్ఎస్అహ్మదాబాద్ఎక్స్ప్రెస్ ను మన్మాడ్, ఇటానగర్, కళ్యాణ్, పాన్వెల్, లోనావాలా, పుణె, దౌండ్ మీదుగా నడుస్తుందని తెలిపారు. కేఎస్ఆర్ బెంగళూరు-, న్యూఢిల్లీ మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈనెల 22న రాత్రి 7.20గంటలకు బదులుగా రాత్రి11.20గంటలకు బయలుదేరుతుందని తెలిపారు.