పలు రైళ్లు పునరుద్ధరించిన దక్షిణమధ్య రైల్వే

పలు రైళ్లు పునరుద్ధరించిన దక్షిణమధ్య రైల్వే

సికింద్రాబాద్: భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రైల్వే లైన్ల పునరుద్ధరణ యుద్ధప్రాతిపదికన జరుగుతోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే పలు దూరప్రాంత ఎక్స్ ప్రెస్ రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నెల్లూరు - పడుగుపాడు, రాజంపేట -నందలూరు , రేణిగుంట  - పూడి గుంట సెక్షన్ లో ట్రాక్ లపై నీళ్లు నిలిచిపోవడంతో ట్రాక్ ల మరమ్మత్తు జరుగుతుండడంతో ఇవాళ తాజాగా ఐదు రైళ్లను రద్దు చేయాల్సి వచ్చిందని రైల్వేశాఖ ప్రకటించింది.  ట్రాక్ మరమ్మత్తులు పూర్తి కావడంతో ఆరు రైళ్లను పునరుద్ధరించినట్లు ప్రకటించింది. 

రద్దయిన రైళ్లు: మధురై –బికనీర్, చెన్నై సెంట్రల్ –న్యూ జల్సాయిగురి, సికింద్రాబాద్ –గోరఖ్ పూర్.

పునరుద్ధరించిన రైళ్లు
 రైల్వే ట్రాక్ మరమ్మత్తులు పూర్తి కావడంతో రేపటి నుంచి ఆరు రైళ్లను పునరుద్ధరించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రేపు బుధవారం నుంచి ఆరురైళ్లు పునరుద్ధరించామని రైల్వేశాఖ వివరించింది. రేపటి నుంచి యధాతథంగా నడవనున్న రైళ్ల వివరాలు ఇలా ఉన్నయి.
తిరుపతి  -   హజరత్ నిజాముద్దీన్ ( రైలు నెంబర్: 12707)
చెన్నై సెంట్రల్   -   ముంబయి సీఎస్ఎంటీ (రైలు నెంబర్: 22160)
ముంబయి సీఎస్ఎంటీ  -  చెన్నై సెంట్రల్ (రైలు నెంబర్: 22159)
చెన్నై సెంట్రల్    –   అహ్మదాబాద్ (రైలు నెంబర్: 22919)
చెన్నై సెంట్రల్   -     ముంబయి ఎల్టీటీ ( రైలు నెంబర్: 12164)  
ముంబయి ఎల్టీటీ   -   చెన్నై సెంట్రల్ ( రైలు నెంబర్: 12163)