మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని గర్ల్స్ హైస్కూల్‌లో టాయిలెట్స్ లేక స్టూడెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్‌లో మొత్తం 379 మంది స్టూడెంట్లు ఉన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కొత్త టాయిలెట్లు కట్టేందుకు పాతవాటిని కూల్చివేశారు. సంవత్సరం గడిచినా కొత్తవి కట్టకపోవడంతో టాయిలెట్‌కు వెళ్లాలంటే కనీసం అర గంటపాటు క్యూలో
ఉండాల్సి వస్తోందని స్టూడెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై హెచ్ఎం వెంకటేశ్వర్లును సంప్రదించగా టాయిలెట్ల నిర్మాణానికి రూ. 60 లక్షలు మంజూరు అయ్యాయని, అయినా చేసిన పనులకు బిల్లులు రాకపోవడం కాంట్రాక్టర్ పనులు చేపట్టడం లేదన్నారు.
- గండీడ్, వెలుగు