- సీఎంకు ఎఫ్‌జీజీ లేఖ
హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగుల అవినీతిపై విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన రిపోర్ట్‌లపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) సెక్రటరీ పద్మనాభరెడ్డి లేఖ రాశారు. గత పదేండ్లలో విజిలెన్స్ శాఖ ప్రభుత్వానికి ఎన్నో రిపోర్ట్‌లు ఇచ్చినా అక్కడి అధికారులు వాటిని సీఎంవోకు పంపకుండా తొక్కి పెట్టారని ఆరోపించారు.
దశాబ్దకాలంలో విజిలెన్స్ ఆఫీసర్లు అధికారుల అవినీతిపై 3,336 రిపోర్ట్‌లు పంపారన్నారు. ఈ రిపోర్ట్‌లపై గతంలో గవర్నర్, సీఎస్‌కు ఫిర్యాదు చేశామని అయినా చర్యలు తీసుకోలేదని చెప్పారు. రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో అవినీతి ఎక్కువగా ఉందని.. ఇలాంటి వాటిపై నిఘా పెట్టాలని ఆయన కోరారు.