కుక్కల బెడద నుంచి పబ్లిక్​ను కాపాడండి

కుక్కల బెడద నుంచి పబ్లిక్​ను కాపాడండి

 

  • మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎఫ్ జీజీ లేఖ

హైదరాబాద్, వెలుగు: కుక్కల బెడద నుంచి పబ్లిక్ ను కాపాడాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి మున్సిపల్​అధికారులను కోరారు. ఈ మేరకు పలు సూచనలతో సోమవారం మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ కు ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో వీధి కుక్కల బెడ‌‌‌‌ద విప‌‌‌‌రీతంగా పెరిగిందని, జీహెచ్ ఎంసీ సర్వే ప్రకారం హైదరాబాద్ లోనే 4 లక్షల కుక్కలు ఉన్నాయని పద్మనాభరెడ్డి తెలిపారు. ఈ మ‌‌‌‌ధ్యకాలంలో కుక్కల‌‌‌‌ను స్టెర్లయిజ్ చేసి వాటి బెడ‌‌‌‌దను త‌‌‌‌గ్గించ‌‌‌‌డానికి జీహెచ్ ఎంసీ చేసిన ప్రయ‌‌‌‌త్నం ఏ మాత్రం ఫ‌‌‌‌లితాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. ప‌‌‌‌సిపిల్లల‌‌‌‌ను వీధి కుక్కలు వెంబ‌‌‌‌డించి తీవ్రంగా గాయ‌‌‌‌ప‌‌‌‌ర‌‌‌‌చ‌‌‌‌డం టీవీల్లో  చూసిన‌‌‌‌ప్పుడ చాలా బాధగా ఉందని ఆయన లేఖలో గుర్తు చేశారు. 

ఓనర్లు లేని కుక్కలను చంపాలని ఆయన సూచించారు. పబ్లిక్ కు నష్టం కలిగిస్తున్న అడవి పందులను, కోతులను చంపుతున్నారని, అదే విధంగా  కుక్కలనూ చంపాలన్నారు. స్టెర్లయిజేష‌‌‌‌న్ కార్యక్రమంపై జీహెచ్ ఎంసీ దృష్టి పెట్టాలని ఆయన కోరారు. మాంసం, ఇతర తినుబండారాలు రోడ్ల మీద వేయడం వల్లే కుక్కల సంఖ్య పెరుగుతోందని, వీటికి అడ్డుకట్ట వేయాలని పద్మనాభరెడ్డి కోరారు. “కుక్కల‌‌‌‌ను మాన‌‌‌‌వతా దృక్పథంతో చూడాలన్న దానిపై ఎటువంటి అభ్యంత‌‌‌‌ర‌‌‌‌ం లేదు.  వాటిని విచ్చల‌‌‌‌విడిగా చంప‌‌‌‌దారు.  కానీ, మనుషుల‌‌‌‌ను కుక్కల బారినుంచి కాపాడడం ముఖ్యమే. పాల‌‌‌‌నా యంత్రాంగం అల‌‌‌‌స‌‌‌‌త్వం వ‌‌‌‌ల్ల ప్రజ‌‌‌‌లు కుక్క కాటుతో బాధ‌‌‌‌ప‌‌‌‌డ‌‌‌‌కూడ‌‌‌‌దు” అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన లేఖలో పేర్కొన్నారు.