హైదరాబాద్ జీడిమెట్ల సీఐకి ఫిక్కి అవార్డు

హైదరాబాద్ జీడిమెట్ల సీఐకి ఫిక్కి అవార్డు

జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేశ్​కు ఫిక్కి (ఫెడరేషన్​ఆఫ్ ఇండియన్​ చాంబర్స్​ఆఫ్​ కామర్స్​ అండ్​ ఇండస్ట్రీ) అవార్డు  దక్కింది. స్మార్ట్ ​పోలీసింగ్ ​విభాగంలో సైబర్​ క్రైమ్​ మేనేజ్​ మెంట్​లో భాగంగా ఆయనకు స్పెషల్ ​జ్యూరీ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమం మంగళవారం ఢిల్లీలో జరిగింది. 16 రాష్ట్రాల్లోని 23 సంస్థల నుంచి 129 ఎంట్రీలు రాగా, తెలంగాణకు చెందిన మల్లేశంను ఈ అవార్డు వరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని చెప్పారు. తనకు సహకరించిన ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.