ఇండియా గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాస్టర్లు హంపి, హారిక గెలుపు

ఇండియా గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాస్టర్లు హంపి, హారిక గెలుపు

చెన్నై: ఇండియా గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక..ఫిడే విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రి చెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీ మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విజయాలు సాధించారు. బుధవారం దివ్య దేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ముఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగిన గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హంపి 53 ఎత్తుల వద్ద గెలుచుకుంది. 

సలిమోవా నూర్గ్యుల్ (బల్గేరియా)తో జరిగిన గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ద్రోణవల్లి హారిక 68 ఎత్తుల వద్ద విజయం సాధించింది. వైశాలి రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు.. షువలోవా పోలినా (రష్యా) మధ్య జరిగిన గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 63 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. ఈ రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత హంపి, దివ్య చెరో రెండు పాయింట్లతో వరుసగా రెండు, మూడు, హారిక ఒకటిన్నర పాయింట్లతో ఆరో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది.