ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

కేంద్ర ప్రభుత్వం మూడు రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేయగా రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ప్రస్తుతం మిజోరం గవర్నర్​గా ఉన్న కంభంపాటి హరిబాబును ఒడిశాకు, బిహార్​ గవర్నర్​గా కొనసాగుతున్న రాజేంద్ర విశ్వనాథ్​ అర్లేకర్​ను కేరళకు, కేరళ గవర్నర్​గా ఉన్న ఆరిఫ్​ మహమ్మద్​ ఖాన్​ను బిహార్​కు బదిలీ చేసింది. మిజోరం గవర్నర్​గా జనరల్ విజయ్​ కుమార్​ సింగ్​ను, మణిపూర్​ గవర్నర్​గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్​ కుమార్​ భల్లాను నియమించింది. 

గవర్నర్​ పదవి

  •     రాష్ట్రానికి ప్రథమ పౌరుడు.
  •     రాజ్యాంగంలోని ఆరో భాగంలో ఆర్టికల్​ 153 నుంచి 167 వరకు రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ గురించి వివరణ ఉంటుంది. అందులో గవర్నర్,         ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రి మండలి, అడ్వకేట్​ జనరల్​ అంతర్భాగంగా ఉంటారు. 
  •  ఆర్టికల్ 153:  ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు.
  •  ఆర్టికల్ 154:  ప్రకారం గవర్నర్, రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వహణాధిపతిగా వ్యవహరిస్తారు. 
  •  ఆర్టికల్​ 155: గవర్నర్ నియామకం
  • ఆర్టికల్ 156:  గవర్నర్ పదవీకాలం
  • ఆర్టికల్ 157: గవర్నర్​గా నియమితులయ్యే వ్యక్తికి ఉండాల్సిన అర్హతలు 
  • ఆర్టికల్​158: గవర్నర్​గా నియమితులయ్యే వారికి సంబంధించిన అర్హతలు, జీతభత్యాలు, నివాస భవనం వివరిస్తుంది.​