బైక్‌‌‌‌ అదుపుతప్పి ఫీల్డ్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ మృతి

బైక్‌‌‌‌ అదుపుతప్పి ఫీల్డ్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ మృతి

తొర్రూరు, వెలుగు: బైక్‌‌‌‌ అదుపు తప్పి కిందపడడంతో ఉపాధి హామీ ఫీల్డ్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ చనిపోయాడు. ఇందుకు మున్సిపల్‌‌‌‌ ఆఫీసర్ల నిర్లక్ష్యమే కారణమంటూ మృతుడి బంధువులు ధర్నాకు దిగారు. మహబూబాబాద్‌‌‌‌ జిల్లా తొర్రూరు మండలంలోని కంఠాయపాలెం గ్రామానికి చెందిన ఈరబోయిన రమేశ్‌‌‌‌ (30) ఉపాధి హామీలో ఫీల్డ్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం తొర్రూరు ఎంపీడీవో ఆఫీస్‌‌‌‌లో మీటింగ్‌‌‌‌కు హాజరైన రమేశ్‌‌‌‌ రాత్రి బైక్‌‌‌‌పై కంఠాయపాలెం వెళ్తున్నాడు. ఈ క్రమంలో చాపల గోపాల్‌‌‌‌రెడ్డి తోట వద్దకు రాగానే రోడ్డు పక్కన డంప్‌‌‌‌ చేసిన చెత్తలో ఉన్న ఓ పరుపుకు బైక్‌‌‌‌ తగలి అదుపుతప్పి కిందపడింది. 

తీవ్రంగా గాయపడ్డ రమేశ్‌‌‌‌ను వరంగల్‌‌‌‌ ఎంజీఎం హాస్పిటల్‌‌‌‌కు తరలించగా అక్కడ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటూ శనివారం తెల్లవారుజామున చనిపోయాడు. కాగా మున్సిపల్‌‌‌‌ సిబ్బంది నిర్లక్ష్యంగా రోడ్డు పక్కన చెత్త వేయడం వల్లే బైక్‌‌‌‌ అదుపుతప్పి రమేశ్‌‌‌‌ చనిపోయాడంటూ మృతుడి బంధువులు శనివారం తొర్రూరు పట్టణంలోని గాంధీ సెంటర్‌‌‌‌ వద్ద ధర్నా నిర్వహించారు. వీరికి గ్రామస్తులు, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, సీపీఐ లీడర్లు మద్దతు తెలిపారు. మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌‌‌‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌‌‌‌ చేశారు. మృతుడి అన్నకొడుకు వీరబోయిన శ్రీపాల్‌‌‌‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.