పీజీసీఐఎల్‎లో ఫీల్డ్​ సూపర్​వైజర్ పోస్టులు.. వేతనం, అర్హతల పూర్తి వివరాలు ఇవే

పీజీసీఐఎల్‎లో  ఫీల్డ్​ సూపర్​వైజర్ పోస్టులు.. వేతనం, అర్హతల పూర్తి వివరాలు ఇవే

ఫీల్డ్​ సూపర్​వైజర్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్ ఆఫ్​ ఇండియా లిమిటెడ్(పీజీసీఐఎల్) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులను కాంట్రాక్ట్​ బేస్డ్​ మీద భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 23వ తేదీలోగా ఆన్​లైన్‎లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్టులు 28: ఫీల్డ్​ సూపర్​వైజర్​(సేఫ్టీ)

ఎలిజిబిలిటీ: కనీసం 55 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్​ డిప్లొమాలో ఉత్తీర్ణతతోపాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. వయోపరిమితి మార్చి 23వ తేదీకి 29 ఏండ్లు మించకూడదు. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాగులు, ఎక్స్​ సర్వీస్​మెన్​ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.​

లాస్ట్ ​డేట్: మార్చి 23. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.