బోయినిపల్లి మండలంలో నీళ్లు లేక ఎండుతున్న పొలాలు

బోయినిపల్లి మండలంలో నీళ్లు లేక ఎండుతున్న పొలాలు

బోయినిపల్లి, వెలుగు: బోయినిపల్లి మండలం తడగొండ లో నీళ్లు లేక పొలాలు ఎండుతున్నాయి. ఇప్పటికే   చెరువుతోపాటు, బోరు బావుల్లో నీళ్లు అడుగంటాయి.  గ్రామంలో సుమారుగా 1200 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. గ్రామానికి డీ 4 కాలువ ద్వారా ఫాజుల్ నగర్ మినీ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసేవారు. 

ఇప్పటికే ఒకసారి విడుదల చేసినప్పటికీ అవి సరిపోకపోవడంతో రైతుల పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో ఎండిన పొలాల్లో  గొర్రెలను మేపుతున్నారు.