
సైదాపూర్, వెలుగు: రెండు కోతుల గుంపులు పరస్పరం దాడికి దిగడం తో స్థానికులు భయాందోళ చుంది పరుగులు తీశారు. 2 గంటల పాటు వాటి మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరిగిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. సైదాపూర్ మండలం వెన్కేపల్లి ఓల్డ్ సినిమా థియేటర్ వద్ద సంచరించే కోతుల గుంపునకు బుధవారం మరో గుంపు తోడైంది.
దీంతో రెండు గుంపులు పరస్పరం తీవ్రస్థాయిలో దాడికి దిగాయి. మిగతా కోతులు అరుపులతో స్థానికులు, రోడ్డుపై వెళ్లేవాళ్లు భయాందోళనతో పరుగులు తీశారు.