‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఎన్టీఆర్‌కు ప్రపంచవ్యాప్తంగా చక్కని గుర్తింపు లభించింది. ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డును అందుకోవడంతో పాటు, ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోషించిన కొమురం భీం పాత్ర అంతర్జాతీయ స్థాయిలో మెప్పించింది.
ఇప్పటికే పలువురు హాలీవుడ్ స్టార్స్ నోట ఎన్టీఆర్ పేరు వినిపించగా, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న ఫుట్‌బాల్ మేజర్ టోర్నీ అయిన ఫిఫా వరల్డ్ కప్.. తన సోషల్ మీడియా పేజ్‌లో ఎన్టీఆర్ పేరును ప్రస్తావించింది.
ముగ్గురు ఫుట్ బాల్ దిగ్గజాల బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్‌ను డిజైన్ చేసింది. ఎన్టీఆర్ అనే ఇంగ్లీష్ అక్షరాల్లో నెయ్‌మార్, టేవెజ్, రొనాల్డో ఫొటోలు వచ్చేలా దీన్ని డిజైన్ చేశారు.
Actor Jr. NTR recently commented on FIFA’s celebratory post featuring Neymar, Tevez, and Ronaldo. His playful response, “Haha…❤️ Happy birthday Neymar, Tevez, Ronaldo…” reflects his wit and charm, resonating with fans worldwide. The FIFA World Cup’s creative tribute added to… pic.twitter.com/gri7gMWuJ4
— SIIMA (@siima) February 5, 2025
అలాగే ముగ్గురు ఆటగాళ్లు ‘నాటు నాటు’ పాటకు స్టెప్స్ వేస్తున్నట్టుగా దీన్ని రూపొందించారు. కొద్ది క్షణాల్లోనే ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై స్పందించిన ఎన్టీఆర్.. 'హాహా... హ్యాపీ బర్త్‌డే నేమార్.. టెవెజ్.. రొనాల్డో' అంటూ ముగ్గురు ప్లేయర్స్‌కు బర్త్ డే విషెస్ తెలియజేశాడు.