Smriti Mandhana: మరో అద్భుత ఇన్నింగ్స్.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన

Smriti Mandhana: మరో అద్భుత ఇన్నింగ్స్.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన

భారత మహిళా క్రికెటర్, ఓపెనర్ స్మృతి మంధాన రికార్డులు కొల్లగొడుతోంది. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా చిత్తుగా ఓడినప్పటికీ.. మంధాన మాత్రం ఆకట్టుకుంది. మొదటి రెండు వన్డేల్లో విఫలమైనా.. ఆఖరి వన్డేలో సెంచరీ(105) చేసింది. అనంతరం స్వదేశంలో వెస్టిండీస్ మహిళలతో జరుగుతున్న వైట్- బాల్ సిరీస్‌లలోనూ మంధాన అదే ఫామ్ కంటిన్యూ చేస్తోంది. 

టీ20 సిరీస్‌లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు (54, 62, 77) చేసిన మంధాన.. వన్డేల్లోనూ అదే దూకుడు కనపరుస్తోంది. వడోదర వేదికగా ఆదివారం (డిసెంబర్ 22) జరిగిన తొలి వన్డేలో మరో హాఫ్ సెంచరీ చేసింది. 102 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 91 పరుగులు చేసింది.  తద్వారా ఈ భారత క్రికెటర్ ఆల్-టైమ్ రికార్డు నెలకొల్పింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది. గతంలో ఈ రికార్డు సౌతాఫ్రికా మహిళా క్రికెటర్ లారా వోల్వార్డ్ పేరిట ఉండేది. ఆ రికార్డును మంధాన బద్దలు కొట్టింది.

ALSO READ | IND vs AUS: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. రోహిత్‌ శర్మ మోకాలికి గాయం

ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక అంతర్జాతీయ పరుగులు

  • స్మృతి మంధాన: 1602 పరుగులు (2024)
  • లారా వోల్వార్డ్: 1593 పరుగులు (2024)
  • నటాలీ స్కివర్-బ్రంట్: 1346 పరుగులు (2022)
  • స్మృతి మంధాన: 1291 పరుగులు (2018)
  • స్మృతి మంధాన: 1290 పరుగులు (2022)