MLC 2024: వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు.. వార్నర్ సరసన ట్రావిస్ హెడ్

MLC 2024: వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు.. వార్నర్ సరసన ట్రావిస్ హెడ్

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్.. వరల్డ్ నెంబర్ వన్ టీ20 బ్యాటర్ ట్రావిస్ హెడ్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్, వరల్డ్ కప్ లో సత్తా చాటిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. ప్రస్తుతం జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ లోనూ అదరగొడుతున్నాడు. సీజన్ ప్రారంభంలో కొంచెం తడబడినా.. ఆ తర్వాత చెలరేగి ఆడుతున్నాడు. వాషింగ్టన్‌ ఫ్రీడం తరపున ఆడుతున్నహెడ్.. వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేసి తమ జట్టును ఫైనల్ కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ ఆసీస్ ఓపెనర్ విధ్వంసం ధాటికి వాషింగ్టన్‌ ఫ్రీడం ఫైనల్లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన యూనికార్న్స్‌ 19 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్‌ ఫ్రీడం 15.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో హెడ్ 44 బంతుల్లో 77  పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటికే నాలుగు హాఫ్‌ సెంచరీలు చేసిన హెడ్‌.. గురువారం (జూలై 25) శాన్‌ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌ జరిగిన క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో మరో మెరుపు అర్ద సెంచరీతో మెరిశాడు. 

Also Read:-ఆసియా కప్ ఫైనల్లో భారత్... సెమీస్‌లో బంగ్లాదేశ్ చిత్తు

ఈ ఇన్నింగ్స్ తో హెడ్ ఒక అరుదైన రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు బాదిన హెడ్ టీ20 ల్లో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా వార్నర్ సరసన చేరాడు. వార్నర్, హెడ్ మాత్రమే టీ20ల్లో ఆస్ట్రేలియా నుంచి వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేయడం విశేషం. 2019 ఐపీఎల్ సీజన్ లో వార్నర్ వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఎనిమిది మ్యాచ్ ల్లో హెడ్‌ 54.5 సగటుతో 327 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 173 ఉండడం విశేషం.     

    

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)