IND vs BAN: భారత బౌలర్ల నిర్లక్ష్యం.. తడబడి నిలబడిన బంగ్లాదేశ్

IND vs BAN: భారత బౌలర్ల నిర్లక్ష్యం.. తడబడి నిలబడిన బంగ్లాదేశ్

దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో టీమిండియా నిర్లక్ష్యంతో మూల్యం చెల్లించుకుంది. బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో అనవసర తప్పిదాలతో ప్రత్యర్థి బంగ్లాను కోలుకునేలా చేసింది. దీంతో మొదట బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ తడబడి నిలబడింది. ప్రస్తుతం 40 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. క్రీజ్ లో జేకర్ అలీ (60), హృదయ్ (70) ఉన్నారు. మరో 10 ఓవర్లలో 80 పరుగులు చేసి భారత్ ముందు డీసెంట్ టోటల్ ఉంచాలని బంగ్లా ప్రయత్నాలు చేస్తుంది. 

నిలబెట్టిన జేకర్, హృదయ్:

టాస్ ఓడినా భారత్ బౌలింగ్ లో దుమ్ము లేపింది. 35 పరుగులకే 5 వికెట్లు తీసి బంగ్లాదేశ్ ను చావు దెబ్బ కొట్టింది. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యతను జేకర్ అలీ, హృదయ్ తీసుకున్నారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ బంగ్లా స్కోర్ కార్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరూ 100  పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో పాటు తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 

ALSO READ | IND vs BAN: ఎంతపని చేశావ్ హిట్ మ్యాన్: రోహిత్ వల్ల నాలుగు రికార్డ్స్ మిస్ చేసుకున్న అక్షర్

ప్రస్తుతం వీరిద్దరూ 190 బంతుల్లో 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ మ్యాచ్ లో ఫీల్డింగ్ లోపాలతో భారత్.. బంగ్లాను గట్టెక్కించింది. 0 పరుగుల వద్ద జెకర్ అలీ ఇచ్చిన ఈజీ క్యాచ్ ను రోహిత్ వదిలేశాడు. రాహుల్ ఈజీ స్టంపింగ్ మిస్ చేయగా.. హార్దిక్ చేతిలోకి వచ్చిన క్యాచ్ ను నేలపాలు చేశాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, షమీ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. హర్షిత్ రాణాకు ఒక వికెట్ దక్కింది.