కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు

నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్,  బీఆర్ఎస్ వర్గాల మధ్య గొడవ జరిగింది. శాలిగౌరారం మండలం ఇటుకులపాడు గ్రామంలో బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి  హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రోడ్లు బాగులేవంటూ కామెంట్స్ చేశారు. ఇటుకులపాడుకు ప్రధాన రహదారి నుంచి గ్రామానికి 3 కిలోమీటర్ల ప్రయాణానికి గంట సమయం పట్టిందన్నారు. వెయ్యి కోట్లతో ప్రగతి భవన్ కట్టుకున్న సీఎం.. ఒక్క కోటి రూపాయలు ఇచ్చుంటే ఈ రోడ్డు బాగుపడేదని అన్నారు. ఇటుకల పాటులో పేదలకు ఇండ్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు వెంకటరెడ్డిపై ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్,  బీఆర్ఎస్ వర్గాల మధ్య  ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పర్యటన మధ్యలోనే ముగించుకొని వెంకటరెడ్డి  వెళ్లిపోయారు.