
మహబూబాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొన్ని చోట్ల ఉద్రిక్తంగా మారింది. మహబూబాబాద్‌లో టీఆర్ఎస్, సీపీఏ నేతల మధ్య ఘర్షణ జరిగింది. మహబూబాబాద్‌లోని జూనియర్ కాలేజీ దగ్గర టీఆర్ఎస్ నేతల డబ్బులు పంచుతున్నారని సీపీఐ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. అయితే పోలీసులు వెంటనే జోక్యం చేసుకొని రెండు వర్గాలను చెదరగొట్టారు. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.