
హైదరాబాద్ చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఎగ్జామ్ లో చూపించడం లేదని కాలేజ్ ఆవరణలో ఆరిఫ్ అనే యువకుడితో కసబ్ అనే యువకుడు గొడవపడ్డాడు. విచక్షణ రహితంగా కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. తలపై బలంగా కొట్టడంతో ఆరిఫ్ అక్కడికక్కడే కుప్పకూలిండు. స్నేహితులు హుటాహుటిన ఆసుపత్రిలో చేర్చించారు. నల్గొండ X రోడ్డులోని S.I.S వొకేషనల్ జూనియర్ కళాశాలలో దాడి చేసిన ఈ దృశ్యాలు సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి.
ALSO READ : కరీనా కపూర్ మళ్లీ తల్లి అవుతుందా.. 42 ఏళ్ల వయస్సులో ఖండించలేదు ఎందుకు..?
బాధిత యువకుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆరిఫ్ కు మెదడులో రక్తం గడ్డకట్టినట్లు పేరెంట్స్ చెబుతున్నారు. తలకు తీవ్ర గాయం కావడంతో ఆరిఫ్ పరిస్థితి విషమంగా ఉంది.