మానవత్వాన్ని చాటుకున్నారు ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని అజీజ్ నగర్ లో ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. దగ్గరలోని అటవీ ప్రాంతంలో కుక్క పిల్లల ఏడుపు శబ్దం వినిపించింది.
పెద్ద బండరాయి మధ్యలో చిక్కుకున్న తల్లి కుక్కను చూస్తూ దాని పది పిల్లలు ఏడవటాన్ని గుర్తించారు ఫైట్ మాస్టర్స్. వెంటనే జేసీబీ సాయంతో బండరాయిని తొలగించి తల్లి కుక్కను రక్షించి పిల్లల చెంతకు చేర్చారు రామ్, లక్ష్మణ్ బృందం సభ్యులు.