- 17 చోట్లా ఎవరితోనూ పొత్తు ఉండదు
- పెండింగ్ సీట్లపై ఎన్నికల కమిటీతో చర్చిస్తా
- బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి
హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి చెప్పారు. ఇవాళ హోటల్ తాజ్ కృష్ణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో చేరికలు నిరంతర ప్రక్రియ అని అవి కొనసాగుతూనే ఉంటాయని అన్నారు. చాలా మంది ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.
ALSO READ :- ఎన్డీఎస్ఏ సమీక్షకు ఈఎన్సీ మురళీధర్ డుమ్మా
రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామని, పెండింగ్ లో ఉన్న 8 సీట్ల విషయంలో పార్టీ ఎన్నికల కమిటీతో చర్చించనున్నట్టు చెప్పారు. ఇవాళ ఢిల్లీ వెళ్తున్న తాను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో , ఇతర నేతలతో సమావేశమవుతానని చెప్పారు.