రెండు గ్రూపుల మధ్య ఘర్షణ.. ఎనిమిది మంది అరెస్టు

  • బ్లేడుతో దాడి చేసి పారిపోయిన నిందితులు

కంటోన్మెంట్, వెలుగు: రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరికి గాయాలు కాగా..  ఎనిమిది మందిని బోయిన్ పల్లి పోలీసులు అరెస్టు చేశారు. బోయిన్​పల్లి సబ్​ఇన్​స్పెక్టర్​శివశంకర్​ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన నితిన్, చందన్ కుమార్ బొలెరో వెహికల్ ను కొని జీవీఆర్ గార్డెన్స్ వద్దనున్న ‘హోల్ సేల్ ఆన్ వీల్స్’ సంస్థ లో పెట్టి నడిపించుకుంటున్నారు.   

ఆదివారం రాత్రి ఒంటిగంట సమయంలో అదే సంస్థలో పనిచేస్తున్న బోయిన్ పల్లి ఆనంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ కు  చెందిన యువకులు అరవింద్, సాయి, తేజ, ఖాన్, పైజాన్, బన్నీ, లతో పాటు  మరో ఇద్దరు యువకులు ఓ పార్సిల్ అందించే విషయంలో నితిన్​,  చందన్ కుమార్ లకు ఫోన్​ చేసి వారితో  గొడవపడి దుర్భాషలాడారు.అక్కడితో ఆగకుండా వారంతా జీవీఆర్ గార్డెన్స్ వద్దకు  చేరుకొని నితిన్, చందన్ కుమార్​లను పిలిచి గొడవకు దిగారు. దీంతో ఇరుగ్రూపుల మధ్య మాటమాట పెరిగి ఒకరిని ఒకరు తోసుకున్నారు. ఈ తోపులాటలో అరవింద్​ గ్రూపునకు చెందిన ఇద్దరికి గాయాలయ్యాయి.  

దీంతో  కోపంతో సాయి  అనే యువకుడు తన వద్ద ఉన్న  బ్లేడుతో నితిన్, చందన్ కుమార్ లపై దాడికి పాల్పడ్డాడు. వారిని బ్లేడ్​తో గాయపరిచి అక్కడి నుంచి పారిపోయాడు.  గాయాలైన నితిన్, చందన్ కుమార్ బోయినపల్లి పోలీస్ స్టేషన్‌‌లో  ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన వ్యక్తిని అతడికి సహకరించిన ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు