FIH Hockey Pro League 2024-25 : అమ్మాయిల గెలుపు.. అబ్బాయిల ఓటమి

FIH Hockey Pro League 2024-25 : అమ్మాయిల గెలుపు.. అబ్బాయిల ఓటమి

భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌: ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐహెచ్‌‌‌‌‌‌‌‌ హాకీ ప్రో లీగ్‌‌‌‌‌‌‌‌ ఆరంభ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఇండియా జట్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ శుభారంభం చేయగా..  హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్ సింగ్ కెప్టెన్సీలోని పురుషుల జట్టు పరాజయంతో టోర్నీని ఆరంభించింది. ఆట చివరి నిమిషంలో నవనీత్ కౌర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన విన్నింగ్‌‌‌‌‌‌‌‌ గోల్‌‌‌‌‌‌‌‌తో ఇక్కడి కళింగ స్టేడియంలో శనివారం జరిగిన విమెన్స్ ప్రో లీగ్ తొలి పోరులో ఇండియా అమ్మాయిలు  3–-2 తేడాతో  ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌పై ఉత్కంఠ విజయం సాధించారు. 

ఇండియా తరఫున నవనీత్‌‌తో పాటు వైష్ణవి (6వ నిమిషం), దీపిక (25వ ని) తలో గోల్‌‌ చేశారు. ఇంగ్లండ్ ప్లేయర్లు డార్సీ బ్రౌన్‌‌‌‌‌‌‌‌ (12వ ని),  ఫియోనా క్రాక్లెస్‌‌‌‌‌‌‌‌ (58వ ని)  గోల్స్ రాబట్టారు.  మరోవైపు మెన్స్ ప్రో లీగ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా  1–3తో స్పెయిన్ చేతిలో ఓడిపోయింది.    పారిస్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ కాంస్య పతక పోరులో ఇండియా చేతిలోఎదురైన ఓటమికి  స్పెయిన్‌‌‌‌‌‌‌‌ ప్రతీకారం తీర్చుకుంది. ఇండియా తరఫున సుఖ్‌‌‌‌‌‌‌‌జీత్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌ (25వ ని) ఏకైక గోల్‌‌‌‌‌‌‌‌ కొట్టగా.. లాసెల్లె(28వ ని), కొబోస్‌‌‌‌‌‌‌‌(38వ  ని), బ్రూనో(56వ ని) తలో గోల్‌‌‌‌‌‌‌‌తో  స్పెయిన్‌‌‌‌‌‌‌‌ను గెలిపించారు.