షేర్ల విభజనకు ఫిలాటెక్స్​ ఓకే

షేర్ల విభజనకు ఫిలాటెక్స్​ ఓకే

హైదరాబాద్​, వెలుగు: సిటీకి చెందిన సాక్స్  కాటన్ ఉత్పత్తుల తయారీ కంపెనీ ఫిలాటెక్స్ ఫ్యాషన్స్ లిమిటెడ్ క్యాపిటల్ మార్కెట్‌‌‌‌లో లిక్విడిటీని, షేర్​హోల్డర్ల సంఖ్యను పెంచడానికి 1:5 (ఒకటికి ఐదు షేర్లు) స్టాక్ స్ప్లిట్‌‌‌‌ను ఆమోదించింది. ఈ నెల ఏడో తేదీన జరిగిన సమావేశంలో కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఈ ప్రతిపాదనను ఆమోదించింది. ఎక్స్‌‌‌‌ట్రా ఆర్డినరీ జనరల్ మీటింగ్ (ఈజీఎం)లో షేర్‌‌‌‌హోల్డర్‌‌‌‌లు సబ్-డివిజన్ కోసం తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత, ఈక్విటీ షేర్ల ఉపవిభజన  కోసం రికార్డ్ తేదీని ప్రకటిస్తారు.

సబ్ డివిజన్ తర్వాత కంపెనీ షేర్ క్యాపిటల్ రూ. 833.40 కోట్లను 8,33,40,72,725 ఈక్విటీ షేర్లుగా విభజించారు. ఒక్కొక్క షేరు వాటా రూపాయి కాగా, కంపెనీ  అధీకృత వాటా మూలధనం రూ. 850 కోట్లు అవుతుంది. 2024–-25 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఈజీఎం ఈ నెల 15న జరగనుంది.