భారీగా పెరుగుతున్న కోటీశ్వరులు..3.24లక్షల మంది ఆదాయం కోటికిపైనే

భారీగా పెరుగుతున్న కోటీశ్వరులు..3.24లక్షల మంది ఆదాయం కోటికిపైనే
  • మార్చి 31 నాటికి 3.24 లక్షల ఐటీఆర్లు

న్యూఢిల్లీ: ఏడాదిలో కోటి రూపాయలు.. అంతకంటే ఎక్కువగా సంపాదించే 3 .24 లక్షల మంది వ్యక్తులు గత నెల 31లోపు ఆదాయపు పన్ను రిటర్న్‌‌‌‌లను దాఖలు చేశారని ఐటీశాఖ తెలిపింది. వీరిలో 2.97 లక్షల మంది వ్యక్తుల ఆదాయం రూ.కోటి నుంచి ఐదు కోట్ల వరకు ఉంది. రూ.5-10 కోట్ల మధ్య ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు 16,797 మంది ఉండగా,  రూ.10 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారు 10,184 మంది ఉన్నట్టు తేలింది.

 అంతేగాక కోట్లాది రూపాయల ఆదాయం గల 3.89 లక్షల కంపెనీలు, సంస్థలు, హెచ్​యూఎఫ్​లు, ట్రస్టులు, వ్యక్తుల సంఘాలు, ప్రభుత్వ సంస్థలు, స్థానిక సంస్థలు ఐటీ రిటర్నులు దాఖలు చేశాయి.  వీరిలో 36వేల మందికి రూ.5-10 కోట్ల ఆదాయం ఉండగా, 43వేల మందికి రూ.10 కోట్ల ఆదాయం ఉంది.  ఐటీ శాఖ లెక్కల ప్రకారం ఈసారి మొత్తం 14.01 కోట్ల ఐటీఆర్​లు వచ్చాయి. 

వీరిలో వ్యక్తిగత వినియోగదారుల సంఖ్య 12.91 కోట్లు.  ఆధార్‌‌‌‌ను లింక్ చేసిన మొత్తం వ్యక్తిగత వినియోగదారుల సంఖ్య 11.86 కోట్లకు పైగా ఉంది. 2024-–25 ఆర్థిక సంవత్సరంలో మార్చి 31 వరకు దాఖలు చేసిన మొత్తం రిటర్నుల సంఖ్య 9.19 కోట్లు కాగా,  ఈ–-వెరిఫైడ్ రిటర్న్‌‌‌‌ల సంఖ్య 8.64 కోట్లుగా ఉంది.