పాల్వంచ అంబేద్కర్ సెంటర్​లో..సీఐ సొంత ఖర్చుతో గుంతల పూడ్చివేత

పాల్వంచ, వెలుగు : పాల్వంచ అంబేద్కర్ సెంటర్​లోని భద్రాచలం హైవేపై భారీ గుంతలు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన సీఐ వినయ్ కుమార్ తన సొంత ఖర్చుతో ఆదివారం దగ్గరుండి రోడ్డుకు రిపేర్లు చేయించారు.

గుంతలు కనిపించక, రాత్రి వేళల్లో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని, యాక్సిడెంట్లు అవుతున్నాయని సీఐ తెలిపారు. ఆయన వెంట ఎస్సై నాగభిక్షం ఉన్నారు.

ALSOREAD :మట్టి రోడ్లు లేని సిటీగా కరీంనగర్ : మంత్రి గంగుల కమలాకర్