ఎమోషనల్ కంటెంట్‌‌తో.. బచ్చలమల్లి మూవీ : అమృత అయ్యర్

ఎమోషనల్ కంటెంట్‌‌తో.. బచ్చలమల్లి మూవీ : అమృత అయ్యర్

‘హనుమాన్‌‌’ లాంటి పాన్‌‌ ఇండియా సక్సెస్‌‌ తర్వాత ‘బచ్చలమల్లి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తోంది అమృత అయ్యర్. అల్లరి నరేష్‌‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి సుబ్బు దర్శకుడు.  రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. డిసెంబర్ 20న సినిమా విడుదలవుతున్న సందర్భంగా.. సినిమా విశేషాలు, తన పాత్ర గురించి అమృత అయ్యర్ ఇలా ముచ్చటించింది. 

‘‘ఇదొక ఎమోషనల్ డ్రామా. ‘హనుమాన్’ షూటింగ్ టైమ్‌‌లో ఈ స్టోరీ విన్నాను. కథతో పాటు నా క్యారెక్టర్‌‌‌‌ చాలా నచ్చింది.  ప్రాధాన్యత గల పాత్ర కావడంతో వెంటనే ఓకే  చెప్పాను.  ఎనభైల నేపథ్యంలో జరిగే కథ ఇది.  విలేజ్ అమ్మాయి అయినప్పటికీ సిటీ కల్చర్ వున్న క్యారెక్టర్‌‌‌‌లో కనిపిస్తా.  ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయి. తను చాలా సెన్సిటివ్. అలాగే వెరీ ఎమోషనల్ క్యారెక్టర్. ఇందులో నాకు, నరేష్ గారికి మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. ఇప్పటివరకూ నేను పోషించిన పాత్రల్లో ఇది డిఫరెంట్‌‌గా ఉంటుంది.

  నరేష్ గారు ఏ ఎమోషనైనా అవలీలగా పండించగలరు. స్క్రీన్‌పై అగ్రెసివ్‌‌గా కనిపించే ఆయన, సెట్స్‌‌లో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు.  ఆయనతో వర్క్ చేయడం మంచి ఎక్స్‌‌పీరియన్స్. అలాగే సుబ్బు గారు చాలా క్లియర్ విజన్ వున్న డైరెక్టర్. ఎమోషన్స్‌‌ని చాలా అద్భుతంగా తీశారు.  ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది.రాజేష్ దండా చాలా పాషన్ వున్న ప్రొడ్యూసర్. ఇదివరకే ఆయనతో ఓ సినిమా చేయాలి. 

కానీ కుదరలేదు. ఫైనల్‌‌గా ఆయన ప్రొడక్షన్ లో వర్క్ చేయడం హ్యాపీ. ఇక హీరోయిన్‌‌గా పల్లెటూరి అమ్మాయి పాత్రలే ఎక్కువగా పోషించా. అయితే నాకు క్వీన్, ప్రిన్సెస్, డ్రీమ్ గర్ల్ లాంటి రోల్స్ చేయాలని ఉంది. యాక్షన్ రోల్స్ చేయడం కూడా ఇష్టమే.  ప్రస్తుతం ఓ తమిళ చిత్రం, మరో కన్నడ సినిమాలో నటిస్తున్నా. తెలుగులో స్క్రిప్ట్స్ వింటున్నా’’.