కోనరావుపేట,వెలుగు; కోనరావుపేట మండలం నాగారంలో ని రామాలయంలో సినీ నటుడు చిన్నా, డైరెక్టర్లు ఆంజనేయులు,శ్రీకాంత్, సినిమాటోగ్రాఫర్ సతీశ్ రెడ్డి ఆదివారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు బొమ్మెన గోపాలరావు,తీగల రవీందర్ సినీ నటులను శాలువాలతో సత్కరించి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ముదాం వెంకటేశం, కిషన్ రావు,రమేశ్, ప్రదీప్, సత్తయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.