అలనాటి నటుడు, కళాప్రపూర్ణ టి.ఎల్. కాంతారావు 101వ జయంతి వేడుకలు ఫిలిం ఛాంబర్ హాల్లో ఘనంగా జరిగాయి. భారత్ కల్చరల్ అకాడమీ, తెలుగు టెలివిజన్ రచయితల సంఘం నిర్వహించిన ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐఎస్ ఆఫీసర్ రమణాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో పాటు రాణించిన కాంతారావుకు ప్రభుత్వాల నుంచి రావాల్సినంత గుర్తింపు రాలేదని, ఇప్పటికైనా ఆ విషయంలో తగిన గుర్తింపు దక్కేలా కృషి చేయాలని ఆయన కోరారు.
కాంతారావుతో ఉన్న అనుబంధాన్ని నటి రోజారమణి గుర్తు చేసుకున్నారు. నటి కవిత, డా.కేవీ కృష్ణ కుమారి, కాంతారావు కూతురు సుశీల, కొడుకు రాజా, రచయిత సంఘం అధ్యక్షుడు ప్రేమ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.