కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో కరీంనగర్ కళోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ కళోత్సవాల్లో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పాల్గొని సందడి చేశారు. మంత్రి గంగుల కమలాకర్ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. ఆయన కళాకారులను ప్రోత్సహిస్తోన్న తీరు చూసి గౌరవం పెరిగిందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఏకైన వ్యక్తి సీఎం కేసీఆర్ ఒక్కరే అన్నారు. అలాంటి నాయకుడు దొరకడం మనందరి అదృష్టమన్నారు. దేశంలోనే కేసీఆర్ గొప్ప నాయకుడు అన్నారు. కేసీఆర్ కి ఒక విజన్ ఉందని..దాని ప్రకారమే ఆయన ప్రణాళికలు అమలు చేస్తారని చెప్పారు. దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందన్నారు.