హైదరాబాద్, వెలుగు: సినీ నటుడు సుమన్ తల్వార్ బర్త్ డే వేడుకలు శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇండో బ్రిటిష్ పెయిన్ క్లినిక్ లోగో, వీడియోను డాక్టర్ విజయభాస్కర్ బండికట్ల ఆధ్వర్యంలో సుమన్ లాంచ్ చేశారు. ఇండో బ్రిటీష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ ట్రీట్మెంట్ విధానాల గురించి ఆయన మాట్లాడారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక పద్ధతుల ద్వారా సర్జరీతో పని లేకుండా ఎన్నో రకాల నొప్పులకు దీర్ఘకాలిక ఉపశమనం అందించే ఈ సరికొత్త వైద్య విధానం పట్ల అవగాహన పెంచాలని సుమన్ తెలిపారు. ఈ నూతన విధానాల వల్ల క్లిష్టమైన సర్జరీలతో వచ్చే ఎన్నో ఇబ్బందులని సులువుగా సమర్థమైన చికిత్సలతో అధిగమించవచ్చని అన్నారు.పెయిన్ క్లినిక్ట్రీట్మెంట్ అవసరం, తనకు లభించిన రిలీఫ్ గురించి ఈ ప్రోగ్రామ్‌కు హాజరైన ప్రముఖ సినీ హీరో భానుచందర్ వివరించారు. అనంతరం చంద్రయాన్– 3 మిషన్ కోసం అధునాతన పరికరాలను అందించిన సోలార్ సైంటిస్ట్ రమేశ్‌ను సత్కరించారు.