నర్సంపేట, వెలుగు: నర్సంపేట టౌన్లో కాసం ఫ్యాషన్స్ 14వ స్టోర్‌ను శుక్రవారం సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి అనసూయ మాట్లాడుతూ అధునాతన కలెక్షన్స్ తో నిత్య నూతన వెరైటీలతో కాసం ఫ్యాషన్స్ పేరు గాంచిందన్నారు. ఈ స్టోర్ ను నర్సంపేటలో తాను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఆమె మాల్ లోని లేడీస్, జెంట్స్, కిడ్స్ వెర్ అంతా కలియతిరిగి సందడి చేశారు. ఈ ప్రాంతవాసులు దసరా షాపింగ్ కాసం ఫ్యాషన్స్ లో చేయాలని కోరారు. షాపింగ్ మాల్ డైరెక్టర్లు కాసం నమశ్శివాయ, కాసం మల్లికార్జున్, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో 4 ఏండ్లుగా ప్రజల మన్ననలు పొందుతూ 14వ స్టోర్స్ ప్రారంభించామని తెలిపారు.
ఈ వారంలో వనపర్తిలో కూడా స్టోర్లను విస్తరించబోతున్నామని, తమ వస్త్రాలను ఆదరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో కాసం ఫణి, కాసం సాయి కృష్ణ, కాసం ధీరజ్, డాక్టర్ కాసం ప్రీతం, యాంసాని ప్రవీణ్ పాల్గొన్నారు. అంతకుముందు నటి అనసూయను చూడడానికి అభిమానులు, యువతీ యువకులు బారులు తీరారు. కార్యక్రమంలో పుల్లూరు అరుణ్ కుమార్, వరుణ్, నగర ప్రముఖులు పాల్గొన్నారు.