ఎల్వీఆర్ షాపింగ్ మాల్ ప్రారంభ వేడుకల్లో సినీ నటి నేహా శెట్టి

నిర్మల్, వెలుగు: నటి, డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి సోమవారం నిర్మల్ లో సందడి చేశారు. స్థానిక ఆర్టీసీ డిపో పక్కన నూతనంగా ఏర్పాటైన ఎల్వీఆర్ షాపింగ్ మాల్ ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మహేశ్వర్​ రెడ్డి చీఫ్​ గెస్ట్​గా హాజరై మాల్​ను ప్రారంభించారు. కార్యక్రమానికి నేహా శెట్టి వస్తుందన్న సమాచారంతో ఉదయం నుంచే అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

దీంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారిపోయింది. నటితో సెల్ఫీలు దిగేందుకు జనం పోటీపడ్డారు. షాపింగ్ మాల్ ప్రారంభం అనంతరం అభిమానులతో ఆమె సందడి చేశారు. తాను ఇంతటి అభిమానం పొందుతానని అనుకోలేదని, నిర్మల్​లో అభిమానులు చూపిన ఈ ఆదరణ తనకు ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందన్నారు.

Also Read : ప్రాణహాని ఉందని వైఎస్ సునీత ఫిర్యాదు.. FIR నమోదు చేసిన పోలీసులు